శంషాబాద్ ఎయిర్ పోర్టు డ్రగ్స్, గంజాయి, స్మగ్లింగ్ కు అడ్డాగా మారుతోంది. ఈ మధ్య విదేశాల నుంచి భారీగా గంజాయి, డ్రగ్స్ ను భారత్ కు తరలిస్తూ పట్టుబడుతున్నారు. లేటెస్ట్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సిఐఎస్ఎఫ్ ఆధికారుల తనిఖీల్లో భారీగా ఎలక్ట్రానిక్ పరికారులు పట్టబడ్డాయి.
అబుదాబీ నుంచి వచ్చిన ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేశారు సిఐఎస్ఎఫ్ అధికారులు. వారి లగేజీ బ్యాగేజ్ లో డ్రోన్ కెమెరాలు, ఐ ఫోన్‌లు, ల్యాప్ టాప్‌లు ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ దాదాపు రూ. 3 కోట్లు ఉంటుందని తెలిపారు అధికారులు. పట్టుబడ్డ వ్యక్తులు సూర్యప్రకాష్, మహమ్మద్ జాంగిర్ గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్టోబర్ 26న బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ భారత ప్రయాణికుడిని తనిఖీ చేయగా హైడ్రోపోనిక్ గంజాయి తరలిస్తున్నట్లు డిఆర్ఐ అధికారులు స్కానింగ్ లో కనుగొన్నారు. లగేజ్ ని తనిఖీ చేయగా సపరేట్ గా తయారు చేసిన సూట్ కేసులో 4.5 కేజీల హైడ్రోపోనిక్(రూ.4.5 కోట్ల విలువ) గంజాయి దొరికింది.
అక్టోబర్ 16 నుంచి ఓ ప్రయాణికుడి నుంచి 24 క్యారెట్ల విలువైన 5 బంగారు బిస్కెట్స్, రెండు కట్ పీసులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మొత్తం 1.798 కిలోలు ఉన్న బంగారం విలువ 2 కోట్ల 37 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
