
శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పాతపట్నం,మెళియాపుట్టి మండలాలోని పెద్దమల్లిపురం, కొయికొండ, చిన్నమల్లిపురం,రట్టిణి ప్రాంతాల్లో పంట పొలాలను సర్వనాశనం చేశాయి. ఏనుగులు ఏ క్షణం ఊర్లోకి వస్తాయో అని ప్రజలు భయపడుతున్నారు. మరో వైపు అటవీశాఖ అధికారులు ట్రాకర్స్ తో ఏనుగుల గమనాన్ని పర్యవేక్షిస్తున్నారు. గ్రామాలలోకి ఏనుగులు రాకుండా బాణ సంచా పేలుస్తున్నారు. ఏనుగుల గుంపు వంశదార నదీ పరీవాహక ప్రాంతాలలో తిష్టవేయడంతో నది వద్దకు వెళ్లడానికి ప్రజలు జంకుతున్నారు.