డెవిల్​​లో ఎల్నాజ్ నోరౌజీ స్పెషల్​ సాంగ్

డెవిల్​​లో ఎల్నాజ్ నోరౌజీ స్పెషల్​ సాంగ్

ఇటీవల అమిగోస్​ సినిమాతో  కల్యాణ రామ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు​.  ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద అభిమానులను నిరాశపరిచింది. ఆయన వెంటనే డెవిల్​ సినిమాను చేస్తున్నారు. ఈ మూవీకి నవీన్​ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు. హై బడ్జెట్​గా రూపొందుతున్నఈ సినిమాలో మాళవిక నాయర్​ ఫిమెల్​ లీడ్​ రోల్​లో కనిపించనుంది. తాజాగా నందమూరి కల్యాణ్​ రామ్​ నటిస్తున్నఈ చిత్రంలో ఒక ప్రత్యేక సాంగ్​ కోసం ఇరానియన్​ బ్యూటీ ఎల్నాజ్ నోరౌజీని తీసుకున్నారని తెలిసింది. ఈ సాంగ్​ కోసం రూ.3 కోట్లు ఖర్చు చేస్తున్నారని సమాచారం.  హైదరాబాద్​లో ఈ సినిమా షూట్​ జరుగుతోంది. అభిషేక్​ పిక్చర్​ సంస్థ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. హర్షవర్దన్​ రామేశ్వర్​ మ్యాజిక్​ డైరెక్టర్​గా పనిచేస్తున్నారు.