ఎలన్ మస్క్ పెండ్లికొడుకాయెనే..

ఎలన్ మస్క్ పెండ్లికొడుకాయెనే..

ప్రపంచ కుబేరుడు ఎలన్​ మస్క్​ తనను తాను పెళ్లి కొడుకు గెటప్​లో చూసుకుని మురిసిపోయాడు. ఇండియన్​ స్టైల్​లో షేర్వానీ ధరించి నవ్వులు చిందించాడు. ఈ ఫొటోలు వైరల్​ అవ్వడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఇది నిజం కాదు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఇటీవల చాలా రకాల ఫొటోలు మార్ఫింగ్​ చేయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ నెటిజన్​ ఈ ఫొటోను ట్వీట్ చేయడంతో మస్క్​ స్పందించాడు. ఈ లుక్​ తనకు చాలా నచ్చిందంటూ కామెంట్ చేశాడు. నిజంగానే పంజాబ్​ కుర్రాడిలా ఉన్నాడంటూ కొందరు కాంప్లిమెంట్ ఇస్తున్నారు. మరో యూజర్​ మస్క్​ను ఏకంగా అందమైన అమ్మాయిలా మార్చి ‘షెలన్​ మస్క్’​ అంటూ క్యాప్షన్​ ఇవ్వడం ఆకట్టుకుంటోంది.

https://twitter.com/cb_doge/status/1664798316775841795