పుణెలో ఆఫీస్ స్పేస్ కొనుగోలు చేసిన టెస్లా..

పుణెలో ఆఫీస్ స్పేస్  కొనుగోలు చేసిన టెస్లా..

భారత ప్రధాని నరేంద్ర మోడీ, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మధ్య  అమెరికాలో మీటింగ్ జరిగిన కొన్ని నెలల తర్వాత, టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ మహారాష్ట్ర పుణెలో పంచశిల్ బిజినెస్ పార్క్‌లోని కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకుంది.  

ఇండియా మార్కెట్లోకి ఎలెక్ట్రానిక్ వెహికిల్స్ దిగ్గజం టెస్లా ప్రవేశించేందుకు ఇది ప్రధాన మార్గంగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతకుముందు, టెస్లా నుండి సీనియర్ అధికారులు భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి  సమావేశాన్ని నిర్వహించారు. 

డేటా అనలిటిక్స్ కంపెనీ  సీఆర్ఈ మ్యాట్రిక్స్ ప్రకారం, టెస్లా.. పంచశిల్ బిజినెస్ పార్క్ అనే పేరుతో నిర్మాణంలో ఉన్న భవనంలో  బీ వింగ్ మొదటి అంతస్తులో 5,850 చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయ స్థలాన్ని కొనుగోలు చేసింది. 

టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కూడా టేబుల్‌స్పేస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఐదేళ్ల పాటు లీజు ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

లీజు ఒప్పందంలో 36 నెలల లాక్-ఇన్ పీరియడ్, ఏడాదికి 5 శాతం ఎస్కలేషన్ నిబంధన ఉంటుంది. అద్దె చెల్లింపులు అక్టోబర్ 1, 2023 నుండి ప్రారంభమవుతాయి.

ఇండియాలో  టెస్లా పురోగతి

టెస్లా సంవత్సరానికి 5 లక్షల ఎలక్ట్రిక్ వెహికిల్స్ ని ఉత్పత్తి చేసే ప్రణాళికలను రచించింది. ఈ గోల్ ని అచీవ్ చేస్తే ఇండియాలో అభివృద్ధి చెందుతున్న ఈవీ మార్కెట్‌ను గణనీయంగా పెంచవచ్చు. 

గతంలోనే టెస్లా దేశీయ విక్రయాలు,  ఎగుమతి కోసం ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయడానికి ఇండియాలో ఫ్యాక్టరీని నిర్మించాలని ప్రతిపాదించింది.