జువెంటస్లో ఎంక్యూర్కు మరింత వాటా

జువెంటస్లో ఎంక్యూర్కు మరింత వాటా

న్యూఢిల్లీ: ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ శనివారం తన అనుబంధ సంస్థ జువెంటస్ హెల్త్‌‌‌‌కేర్ లిమిటెడ్‌‌‌‌లోని మిగిలిన 20.42 శాతం వాటాను మైనారిటీ వాటాదారుల నుంచి రూ.724.9 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. జువెంటస్ హెల్త్‌‌‌‌కేర్ లిమిటెడ్‌‌‌‌లోని మైనారిటీ వాటాదారుల వాటాను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని ఎంక్యూర్​ ఫార్మాస్యూటికల్స్ రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌లో వెల్లడించింది. 

ఈ లావాదేవీ పూర్తయిన తర్వాత, జువెంటస్ ఎంక్యూర్​  పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థగా మారుతుంది. కంపెనీకి ప్రస్తుతం జువెంటస్‌‌‌‌లో 79.58 శాతం వాటా ఉంది. ఈ లావాదేవీ 2026 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్​లో ముగిసే అవకాశం ఉంది.