ఆర్ధిక ఇబ్బందులతో ఉద్యోగి ఆత్మహత్య

ఆర్ధిక ఇబ్బందులతో ఉద్యోగి ఆత్మహత్య

కరోనా వైరస్ ను అరికట్టేందుకు లాక్ డౌన్ విధించాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. లాక్ డౌన్ కారణంగా చేస్తున్న కంపెనీ నుంచి సరిగా జీతం రాకపోవడంతో ఆర్ధిక ఇబ్బందులు తట్టులేక ఓ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కూకట్ పల్లి హౌజింగ్ బోర్డులో జరిగింది.

తమిళనాడు తిరుత్తనికి చెందిన లక్ష్మీనారాయణ శివకుమార్ నిజాంపేట్ రోడ్డులోని భవ్యాస్ ఆనందం అపార్ట్ మెంట్స్ లో కుటుంబంతో నివసిస్తున్నాడు. మొదటగా KPHB కాలనీలోని విల్లేమాన్ మెక్ డొవల్స్ కంపనీలో సేల్స్ కోఆర్డినేటరుగా పని చేసిన శివకుమార్… ఆ కంపనీ హైదరాబాద్ నుంచి తరలిపోవటంతో ఎర్రమంజిల్ లోని నెక్సస్ కంపెనీలో అడ్మిన్ గా ఉద్యోగంలో చేరాడు. కొత్త కంపనీలో సరిపడా జీతం రాకపోవటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న లక్ష్మీనారాయణకు.. లాక్ డౌన్ తో మరింత ఆర్ధికంగా చితికిపోయాడు. సాలరీ రాకపోవడంతో సమస్యలు పెరిగాయి. దీంతో గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి, నిద్రపోయిన ఆయన తెల్లవారుజామున ఇంట్లో చెప్పకుండా వెళ్ళి శివాలయం వెనుక గల హైటెన్షన్ స్థంభానికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి శివకుమార్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్నిపోస్టు మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.