సింగరేణిలో కరోనా పంజా..డ్యూటీకి రాని ఉద్యోగులు

సింగరేణిలో కరోనా పంజా..డ్యూటీకి రాని ఉద్యోగులు

 

కరోనా వైరస్ నేపథ్యంలో ఆరు నెలలుగా అరకొర బొగ్గు ఉత్పత్తితో అపసోపాలు పడుతున్న సింగరేణిని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కరోనా, వర్షాల దెబ్బకు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది. 2020–-21 ఆర్థిక సంవత్సరానికి 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్ప త్తి టార్గెట్  పెట్టుకోగా ఏప్రిల్ నుంచి జులై వరకు కేవలం 58 శాతం మాత్రమే ఉత్పత్తి చేయగలిగారు. గత నాలుగు నెలల్లో 21.56 మిలియన్ టన్నుల కుగాను 12.41 మిలియన్ టన్నుల బొగ్గు వెలికి తీయగలిగారు. ప్రస్తు పరిస్థితులను చూస్తే ఈ ఏడాది వార్షిక  లక్ష్యాన్ని అందుకోవడం కష్టమని సింగరేణి యాజమాన్యం ఆందోళన చెందుతోంది.

బొగ్గు గనులపై కరోనా పంజా

సింగరేణి విస్తరించిన ఆరు జిల్లాల్లోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే బొగ్గు గనుల ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 137 రోజుల్లో ఏకంగా 1388 కరోనా పాజిటివ్ కేసుల నిర్ధారణతో సింగరేణియుల్లో భయాందోళన నెలకొంది. కరోనా బారినపడి సుమారు 30 మంది సింగరేణి ఉద్యోగులు, ఆఫీసర్లు, కార్మికుల కుటుంబ సభ్యులు మృత్యువాత పడ్డారు. వందలాది మంది హోంక్వారంటైన్, ఐసోలేషన్ సెంటర్ల భయం భయంగా గడుపుతున్నారు. వైరస్ భయంతో డ్యూటీలు చేసేందుకు ఉద్యోగులు ఆసక్తి చూపడంలేదు. క్రమేణా హాజరు 40 శాతానికి పడిపోయి బొగ్గు ఉత్పత్తి తగ్గింది. కరోనా వైరస్ను అరికట్టేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టినా ఉద్యోగులకు మాత్రం భరోసా కలగడం లేదు. కొద్ది రోజులుగా సింగరేణి అన్ని ఏరియాల్లోఉన్న ఆసు పత్రుల్లోఉద్యోగులు, ఆఫీసర్లు, కార్మికుల కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు చేస్తున్నారు. జులై 27 నుంచి యాజమాన్యం ప్రతిచోట రోజుకు 200 కరోనా టెస్టులు చేయాలని టార్ట్గెగా పెట్టుకుంది. లాక్డౌన్ సమయంలో మంచిర్యాల, పెద్దపల్లి, కొ త్తగూడెం వంటి ప్రాంతాల్లోఒకటి, రెండు పాజిటివ్ కేసులు బయటపడగా ప్రస్తుం సింగరేణి వ్యాప్తంగా వీటి సంఖ్య వందల్లోకి చేరింది. సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసే ఉద్యోగులు, ఆఫీసర్లు ఫిజికల్ డిస్టెన్స్ మెయింటెయిన్ చేయడం సాధ్యం కాకపోవడంతో కరోనా వైరస్ విస్తరిస్తోంది. దీంతో గనులకు లాక్ డౌన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 40 శాతం మంది ఉద్యోగులు డ్యూటీలకు రావడం లేదు.

137 రోజుల్లో 1388 పాజిటివ్ కేసులు

సింగరేణిలో కరోనా టెస్టులు చేయక ఉద్యోగులు ఇన్నాళ్లు ఎవరికివారే వైరస్ లేదనే ధీమాతో కాలం గడిపారు. తాజాగా చేస్తున్న టెస్టుల్లో కరోనా లక్షణాలు లేనివారికి సైతం పాజిటివ్ తేలడంతో భయాందోళనకు గురవుతున్నారు. సింగరేణి వ్యాప్తంగా గడిచిన 137 రోజుల్లో 13 ప్రాంతాల్లో 7,905 మందికి టెస్టులు చేశారు. 1388 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలో పాజిటివ్ సోకిన ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉంది. ఇక్కడ 1,090 మందికి పరీక్షలు చేస్తే 300 మందికి వైరస్ సోకింది.