
ఇవాళ(శుక్రవారం) ఉదయం బీహార్‌లోని గయాలో ఎన్‌కౌంటర్ జరిగింది. 205 కోబ్రా ట్రూప్స్, బీహార్ పోలీసులు కలిసి సంయుక్తంగా నక్సల్స్ కోసం కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో నక్సల్స్ పోలీసులకు ఎదురుపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్ట్ హతమయ్యాడు. ఘటనాస్థలిని నుంచి ఏకే 47 రైఫిల్, మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 2 కిలోల ఐఈడీ బాంబును పోలీసులు నిర్వీర్యం చేశారు. నక్సల్స్ కోసం పోలీసులు కూంబింగ్ కొనసాగిస్తున్నారు.