జమ్మూకశ్మీర్ లో ఎన్​కౌంటర్.. ఉగ్రవాది హతం

 జమ్మూకశ్మీర్ లో ఎన్​కౌంటర్.. ఉగ్రవాది హతం

జమ్మూకశ్మీర్ కథువా జిల్లాలో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. హీరానగర్ లోని సైదా సోహల్ ఏరియాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. హీరానగర్ సెక్టార్  కతువాలోని సైదా గ్రామంలో ఓ ఇంటిపై ఉగ్రవాదులు దాడి చేశారు. దీంతో అప్రమ్తమైన భద్రతా బలగాలు గ్రామానికి చేరుకుని టెర్రరిస్టులపైకి కాల్పులు జరిపారు.

 మరోవైపు దోడా జిల్లాలోని ఆర్మికి చెందిన టెంపరరీ ఆపరేటింగ్ బేస్ పై దాడి చేశారు. ఇదే టైంలో భద్రతా బలగాలు అప్రమత్తం కావడంతో ఉగ్రవాదులు, పోలీసులకు మధ్య ఎన్ కౌంటర్ కంటిన్యూ అవుతోంది. గ్రామంలో ఇతర ఉగ్రవాదులు దాడి ఉన్నారన్ని సమాచారం మేరకు కశ్మీర్ పోలీసులు, పారా మిలటరీ బలగాలు సోదాలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల్లోనే జమ్మూలో ఇది రెండో దాడి.