అగ్నిపథ్​తో యువతకు తీరని అన్యాయం: ఖర్గే

అగ్నిపథ్​తో యువతకు తీరని అన్యాయం: ఖర్గే

న్యూఢిల్లీ: అగ్నిపథ్ స్కీమ్​తో యువతకు తీరని అన్యాయం జరగుతోందని, అధికారంలోకి రాగానే దానిని రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. పాత రిక్రూట్​మెంట్ పద్ధతిని తిరిగి తీసుకొస్తామని చెప్పింది. ఈ మేరకు సోమవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే  రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. సాయుధ దళాల్లో రెగ్యులర్ రిక్రూట్​మెంట్ ప్రక్రియను రద్దు చేయడంతో 2 లక్షల మంది భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొందని  ఖర్గే ఆరోపించారు. “ఈ స్కీమ్​లో సమస్యలున్నాయి. ఇది సైన్యం, నేవీ, ఎయిర్ ఫోర్స్ ను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆర్మీ మాజీ చీఫ్ నరవణే కూడా అన్నారు” అని ఖర్గే పేర్కొన్నారు.