ఇంధన వనరులు వాటి ఆధారాలు

ఇంధన వనరులు  వాటి ఆధారాలు

ఏదైనా ఒక ప్రాంతం లేదా దేశం వ్యవసాయపరంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి కావాల్సిన ముఖ్యమైన మౌలిక వనరుల్లో ఇంధన వనరులు ముఖ్యమైనవి. ప్రాథమికంగా వస్తు ఉత్పత్తి, సేవారంగ అంశాలకు శక్తివనరులు కీలకం. ఇంధన వనరుల స్వభావాన్ని అనుసరించి వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. 

సాంప్రదాయ ఇంధన వనరులు: మానవుడు అనాదిగా ఉపయోగిస్తూ ఉన్న ఇంధన వనరులు. ఉదా: బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, జలవిద్యుత్​. అణుశక్తి.

సాంప్రదాయేతర ఇంధన వనరులు: ఇటీవల కాలంలో మానవుడు అభివృద్ధి చేసిన, అధిక ప్రాచుర్యంలో ఉన్నవి. వీటిని తిరిగి రెండు రకాలుగా విభజిస్తారు. 

ఎ. పునరుత్పాదక ఇంధన వనరులు: సౌరశక్తి, పవనశక్తి, జీవశక్తి, వర్థం నుంచి శక్తి, చిన్నతరహా జల విద్యుత్​, బయోమాస్​ పవర్​, బగాసి కో జనరేషన్​, జీవ ఇంధనాలు, బయోగ్యాస్ తదితర జీవశక్తి రకాలు. చిన్నతరహా జలవిద్యుత్​ను మైక్రో, మినీ, స్మాల్​ హైడ్రో రకాలుగా విభజిస్తారు. సౌరశక్తిని సౌరవిద్యుత్​, సోలార్​ ఫొటో వోల్టాయిక్స్​గా విభజిస్తారు. 

బి. నవీన శక్తివనరులు: ఇవి పూర్తిగా కొత్తతరం వనరులు. ఇప్పుడిప్పుడే వినియోగంలోకి వస్తున్నాయి. హైడ్రోజన్​ శక్తి, జియోథర్మల్​ శక్తి, ఓషన్​ ఎనర్జీ, బ్యాటరీ ఆపరేటెడ్​ వెహికిల్స్​, సముద్రతరంగ శక్తి, టైడల్​ శక్తి, ఓషన్​ థర్మల్​ గ్రేడియంట్​ ఎనర్జీ, షేల్​ గ్యాస్​, కోల్​బెడ్ మీథేన్​, గ్యాస్​ హైడ్రేట్స్​ తదితర సహజవాయు రూపాంతరాలు.  

ఇంధన వనరుల పునరుత్పత్తి సామర్థ్యాన్ని అనుసరించి వాటిని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. 
పునరుత్పత్తి చెందని ఇంధన వనరులు: వీటికి పునరుత్పత్తి సామర్థ్యం ఉండదు. మానవుడు వినియోగించే కొద్దీ వాటి పరిమాణం తగ్గిపోతుంది. ప్రస్తుతం ఎక్కువ వినియోగంలో ఉన్నాయి. కాలుష్యాన్ని కలుగజేస్తాయి.

ఉదాహరణకు బొగ్గు, ముడిచమురు, సహజవాయువు, అణు విద్యుత్.

పునరుత్పత్తి చెందే ఇంధన వనరులు: ఇవి పునరుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వినియోగించే కొద్దీ తిరిగి పునరుజ్జీవం చెందుతాయి. కాలుష్య రహితమైనవి. వీటినే హరిత ఇంధనాలు అంటారు.
ఉదాహరణకు జల విద్యుత్​, సౌరశక్తి, పవనశక్తి, వేలాశక్తి, భూతాపితశక్తి మొదలైనవి.

భారతదేశ విద్యుత్​ రంగం

    దేశంలో మొదటిసారిగా 1897లో డార్జిలింగ్​ సమీపంలోని లోనాలోవా వద్ద జనరేటర్​ ఆధారిత విద్యుత్ ఉత్పాదన ప్రారంభమైంది. ఆ తర్వాత దేశంలో మొదటి జల విద్యుత్​ ప్రాజెక్టును 1902లో కర్ణాటకలోని కావేరి నదిపై గల శివ సముద్రం జలవిద్యుత్​ కేంద్రం ఏర్పాటుతో కొనసాగింది. 

    ప్రపంచంలో విద్యత్తు ఉత్పాదనలో భారతదేశం మూడో స్థానంలో ఉంది.
    ప్రస్తుతం దేశంలో మొత్తం స్థాపిత విద్యుత్​ ఉత్పత్తి సామర్థ్యం 3,93,389  మెగావాట్లు.

 ఇందులో కేంద్ర, రాష్ట్రాలు, ప్రైవేట్​ రంగాల యాజమాన్యం కింది ఉత్పత్తి చేయబడుతున్న విద్యుత్​ వాటాలు ఇలా ఉన్నాయి.

    స్వాతంత్ర్యం వచ్చే నాటికి దేశంలో మొత్తం విద్యుత్తు ఉత్పాదన 1400 మెగావాట్లుగా ఉండేది. కానీ 2021, డిసెంబర్​ 31 నాటికి దేశంలో మొత్తం స్థాపిత సామర్థ్యం 3,93,389 మెగావాట్లు .

ALSO READ:  ఇక యూపీఐ పేమెంట్లతో రైల్వే టికెట్లు

    2021 ఏప్రిల్​ నాటికి దేశంలో అత్యధిక విద్యుత్తు స్థాపిత సామర్థ్యం కలిగిన రాష్ట్రాలు. అవి.. 1. మహారాష్ట్ర (44.16 గిగావాట్లు), 2. గుజరాత్​ (37.89 గిగా వాట్లు), 3. తమిళనాడు 33.69 (గిగావాట్లు), 4. కర్ణాటక (30.09 గిగావాట్లు).