గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం సోదరుడు అరెస్ట్

గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం సోదరుడు అరెస్ట్

మనీలాండరింగ్ కేసులో  దావూద్ ఇబ్రహీం  సోదరుడు  ఇక్బాల్ కస్కర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఇక్బాల్ ను   ముంబైలోని కోర్టు 7 రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంపై ఇటీవల నమోదైన మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా జైలులో ఉన్న సోదరుడు ఇక్బాల్ కస్కర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసినట్లు అధికారులు వెల్ల‌డించారు. పలు దోపిడీ కేసుల్లో ఇప్పటికే థానే జైలులో ఉన్న కస్కర్‌ను తాజా కేసులో అదుపులోకి తీసుకున్నారు. 

ఫిబ్రవరి 16న అతడిపై ప్రొడక్షన్ వారెంట్ జారీ చేసిన ప్రత్యేక ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు చెప్పారు. ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ అతనిపై కొత్తగా నమోదైన కేసులో, పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ ఇబ్రహీం , ముంబై అండర్ వరల్డ్‌తో సంబంధం ఉన్న ఇతరులపై ప్రశ్నించడానికి అతని కస్టడీని కోరింది. కొత్త కేసు నమోదై, ఫిబ్రవరి 15న ముంబైలో అండర్‌వరల్డ్‌ కార్యకలాపాలు, అక్రమ ఆస్తుల లావాదేవీలు, హవాలా లావాదేవీలు వంటి వాటిపై దాడులు చేసిన నేపథ్యంలో ED ఈ చర్య తీసుకుంది.

ఇటీవలే దావూద్ ఇబ్రహీం సోదరి, సోదరుడి ఇళ్లపై ఈడీ దాడులు నిర్వహించడం కలకలం రేపింది. దీంతో పాటు గ్యాంగ్‌స్టర్ చోటా షకీల్ బావమరిది ఇంటిపైనా దాడులు చేయడంతో ఏం జరుగుతుందోనని అంతా ఉత్కంఠ నెలకొంది. ఎన్ఐఏ కేసు దర్యాప్తులో భాగంగానే ఈడీ దాడులు చోటుచేసుకున్నాయి. పక్కా సమాచారంతో ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. మనీ లాండరింగ్, హవాలా, అక్రమ ఆస్తి లావాదేవీల గుట్టుని రట్టుచేసేందుకు ఈ దాడులు జరిగాయి. ఈడీతో పాటు ఎన్ఐఏ ఇటీవల దావూద్ ఇబ్రహీంపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం నమోదు చేసింది.

ఇవి కూడా చదవండి:

ఆకట్టుకుంటున్న స్మృతి ఇరాని డాన్స్

విచ్చలవిడిగా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్.. హోండా ఆక్టివా సీజ్