విచ్చలవిడిగా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్.. హోండా ఆక్టివా సీజ్

విచ్చలవిడిగా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్.. హోండా ఆక్టివా సీజ్

హైదరాబాద్: ఒకే టూవీలర్ పై 92 ట్రాఫిక్ ఛలాన్లున్నట్లు గుర్తించారు కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు. శుక్రవారం ఈసిఐఎల్ చౌరస్తాలో తనిఖీలు చేసే క్రమంలో టీఎస్10ఈసి3035 అనే నెంబరు గల హోండా ఆక్టివాపై 92 ఛలాన్లు ఉన్నట్లు గర్తించామని చెప్పారు కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు. 92 ఛలాన్లకు రూ. 25 వేల 250 రూపాయలు జరిమానాలు ఉన్నాయన్నారు. సిగ్నల్ జంప్, నో హెల్మెట్, రాంగ్ రూట్.. విచ్చలవిడిగా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశారని పోలీసులు చెప్పారు. వెంటనే స్కూటీని సీజ్ చేశామని తెలిపిన ట్రాఫిక్ పోలీసులు.. అమౌంట్ క్లియర్ చేసి స్కూటీని తీసుకెళ్లాలని యజమానికి హెచ్చరించామన్నారు.