
హైదరాబాద్ : నేషనల్ హెరాల్డ్ కేసులో రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఈడీ సమన్లు జారీ చేసింది. మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, రేణుకా చౌదరిలకి ఈ నోటీసులు జారీ చేశారు. మనీలాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50 కింద ఈడీ ఈ నోటీసులు జారీ చేసింది.
అక్టోబర్ 10న ఈడీ విచారణకు హాజరు కావాలని తెలిపింది. నేషనల్ హెరాల్డ్ ఇష్యూకు సంబంధించిన కంపెనీలకు వీరు ఎమౌంట్స్ ట్రాన్స్ ఫర్ చేశారని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఇదే కేసులో ఈడీ ఇప్పటికే సోనీయా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించింది.