మనీలాండరింగ్ కేసు.. ఈడీ అదుపులో తమిళనాడు మంత్రి

మనీలాండరింగ్ కేసు.. ఈడీ అదుపులో తమిళనాడు మంత్రి

మనీలాండరింగ్ కేసులో భాగంగా డీఎంకే నేత, తమిళనాడు విద్యాశాఖ మంత్రి పొన్ముడిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.  కేంద్ర పోలీసు బలగాలు భద్రత మధ్య పొన్ముడిని ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు.  ఆయన కుమారడు గౌతమ్ నివాసాలు, ఆఫీసుల్లో 13 గంటల పాటు అధికారులు సోదా చేశారు.  ఈ సోదాల్లో మంత్రి పొన్ముడి ఇంట్లో రూ.70 లక్షల  నగదుతో పాటు విదేశీ కరెన్సీ, అమెరికా డాలర్లు సహా రూ.10 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.  

అనంతరం  ఈడీ కార్యలయంలో పొన్ముడిని అధికారులు ప్రశ్నిస్తు్న్నారు.  మంత్రి పొన్ముడిని అరెస్టు చేస్తారా లేదా అనేది విచారణ తరువాత తేలనుంది.  మంత్రి పొన్ముడిపై ఈడీ దాడులను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్  ఖండించారు. .  పొన్ముడి ఈ కేసును న్యాయపరంగా ఎదుర్కొంటారని, బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశానికి ముందు జరిగిన ఈ దాడిని దారి మళ్లించే ఎత్తుగడ తప్ప మరొకటి కాదని అన్నారు.