చీఫ్‌‌ జస్టిస్‌‌ బెంచ్‌‌కి ఇంజనీరింగ్‌‌ కాలేజీల ఫీజుల కేసు

చీఫ్‌‌ జస్టిస్‌‌ బెంచ్‌‌కి ఇంజనీరింగ్‌‌  కాలేజీల ఫీజుల కేసు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేట్‌‌ ఇంజనీరింగ్‌‌ కాలేజీల్లో ఫీజుల పెంపునకు ఉత్తర్వులు ఇవ్వాలంటూ దాఖలైన వ్యాజ్యాలు విచారణ కోసం ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని డివిజన్‌‌ బెంచ్‌‌కు చేరాయి. ఈ పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తులు ఇద్దరు సింగిల్‌‌ జడ్జిల ఏకసభ్య ధర్మాసనాలు వేరువేరు నిర్ణయాలు వెలువరించాయి. దీంతో ఈ వ్యాజ్యాలను చీఫ్‌‌ జస్టిస్‌‌ బెంచ్‌‌ ఎదుట ఉంచాలని జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు వెలువరించారు.

 ఒక ప్రైవేట్‌‌ ఇంజనీరింగ్‌‌ కాలేజీ పిటిషన్‌‌లో ఫీజు పెంపునకు జస్టిస్‌‌ విజయ్‌‌సేన్‌‌రెడ్డి అనుమతిచ్చారు. మరో న్యాయమూర్తి జస్టిస్‌‌ కె.లక్ష్మణ్‌‌ ఫీజుల పెంపునకు నిరాకరించారు. తుది తీర్పుకు లోబడి ఫీజుల పెంపు అంశం ఉంటుందన్నారు.