తెలంగాణలోని ఇంజినీరింగ్ కాలేజీలు ఫీజులు సవరించాలని కోరుతూ తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీకి) దరఖాస్తులు చేసుకున్నాయి. ఈ ప్రతిపాదనలపై టీఏఏఎఫ్ఆర్సీ ఫిబ్రవరి 25న కాలేజీల వారీగా రివ్యూ చేయనుంది. మొత్తం 157 కాలేజీలు ప్రతిపాదనలతో కూడిన దరఖాస్తులు చేసుకున్నాయి.
తాజాగా యాజమాన్యాలు చేసిన ప్రతిపాదనల ప్రకారం వీటిల్లో అడ్మిషన్ పొందాలంటే ఏటా లక్షన్నర నుంచి రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. మూడేండ్ల బ్లాక్ పీరియడ్ కు సంబంధించి కాలేజీలు 50% నుంచి 100% పెంపునకు ప్రతిపాదనలు పంపాయి. కొత్త టారిఫ్ 2022 2026 విద్యాసంవత్సరం నుంచి అమలు చేయాలని కోరాయి.
ALSO READ | నిట్ వరంగల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేదు, కేవలం ఇంటర్వ్యూ మాత్రమే..
టాప్ 10 కాలేజీలో ఒక్కటిగా ఉన్న చైతన్య భారతి ఇని స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ (సీబీఐటీ) ప్రస్తుతం వసూలు చేస్తున్న 1.65 లక్షలున్న ఫీజును 2,84 లక్షలకు పెంచాలని కోరుతోంది. విఎన్ ఆర్ విజ్ఞాన జ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీస్ (వీఎస్ఆర్ వీజేఐ ఈటీ) ప్రస్తుతం ఉన్న 1.35 లక్షల ఫీజును 2.84 లక్షలకు పెంచాలంటూ ప్రతిపాదనలు పంపింది. తెలంగాణలోని టాప్ 15 ఇంజినీరింగ్ కాలేజీలు రూ. 2 లక్షల ఫీజు వసూలు చేసుందుకు అనుమతివ్వాలని దరఖాస్తులు చేసుకున్నాయి. మిగతా కాలేజీలు కూడా ఏటా రూ. 1.50 లక్షల ఫీజు ఉండాలని అంటున్నాయి.
25న కాలేజీల వారీగా రివ్యూ
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల నుంచి ఫీజుల సవరణపై ప్రతిపాదనలు స్వీకరించిన తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ ఫిబ్రవరి 25 నుంచి కాలేజీల వారీగా రివ్యూ చేయనుంది. ఆ తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తుంది. 2022 2025 సంవత్సరానికి గాను 176 కాలేజీలు ఫీజుల సవరణకు దరఖాస్తులు చేసుకోగా రాబోయే మూడేళ్లకు గాను 157 కాలేజీలు మాత్రమే ఫీజు సవరణకు దరఖాస్తు చేసుకున్నాయి. అవసరమైన పత్రాలు, లావాదేవీలు పరిశీలించిన మీదటే టీఏఎఫ్ఆర్సీ ఫీజుల పెంపుపై నిర్ణయం తీసుకోనుంది.
