డిసెంబర్ 1 నుంచి ఇంజనీరింగ్ ఫస్టియర్ క్లాసులు

డిసెంబర్ 1 నుంచి ఇంజనీరింగ్ ఫస్టియర్ క్లాసులు

హైదరాబాద్, వెలుగు: ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ల షెడ్యూల్ మరోసారి మారింది. వచ్చేనెల 30 వరకూ ఇంజనీరింగ్, సంబంధిత యూజీ కోర్సుల్లో అడ్మిషన్లు పూర్తిచేసుకోవాలని యూనివర్సిటీలకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్​(ఏఐసీటీఈ) సూచించింది. డిసెంబర్ 1 నుంచి ఫస్టియర్ స్టూడెంట్లకు క్లాసులు పెట్టాలని పేర్కొంది. ఈ మేరకు కొత్త షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఐఐటీలు, ఎన్ఐటీల్లో అడ్మిషన్లు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. గత షెడ్యూల్ ప్రకారం నవంబర్1 నుంచే క్లాసులు ప్రారంభం కావాల్సి ఉంది. మరోపక్క నవంబర్ 5 వరకూ మేనేజ్మెంట్ కోటా సీట్లను భర్తీ చేసుకోవాలని ఉన్నత విద్యామండలి కాలేజీలకు ఆదేశించింది. ఏఐసీటీఈ తాజా ఉత్తర్వులతో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ గడువూ పొడగించే అవకాశముంది.  ఇంజనీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం కొనసాగుతున్న వెబ్ ఆప్షన్లు షెడ్యూల్ ప్రకారం నేటితో ముగియనుంది.

For More News..

హైదరాబాద్​‌లో చెరువుల  పర్యవేక్షణకు 15 టీమ్‌లు

టెట్ ఒక్కసారి రాస్తే చాలు.. లైఫ్​టైమ్ వ్యాలిడిటీ

ఎంబీబీఎస్ ఫీజుల పెంపు? కన్వీనర్​ సీటుకే రూ.లక్ష అయితే… మరి మేనేజ్‌మెంట్ సీటుకు?