హాఫ్ సెంచరీలతో చెలరేగిన ఓపెనర్లు..భారీ స్కోర్ దిశగా ఇంగ్లండ్

హాఫ్ సెంచరీలతో చెలరేగిన ఓపెనర్లు..భారీ స్కోర్ దిశగా ఇంగ్లండ్

వరల్డ్ కప్ -2019లో భాగంగా బర్మింగ్‌ హామ్ వేదికగా ఇండియాతో జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లండ్ దూకుడు మీదుంది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ కు మంచి ప్రారంభం దక్కంది. ఓపెనర్లు జాసన్ రాయ్, బెయిర్ స్టో హాఫ్ సెంచరీలతో చెలరేగి ఆడుతున్నారు. ఈ క్రమంలోనే వికెట్ నష్టపోకుండా ఇంగ్లండ్ 100 స్కోర్ దాటింది. ఈ జోడీ ఇలా 100 దాటడం ఇది 9వసారి. ఇంగ్లండ్ జోరు చూస్తుంటే భారీ స్కోర్ చేసేలా కనిపిస్తుంది.

17 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్ 124/0.

బెయిర్ స్టో(62), జాసన్ రాయ్(57) రన్స్ తొ క్రీజులో ఉన్నారు.