
బ్రిటన్: ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతోన్న రెండో టెస్ట్ ఫస్ట్ ఇన్సింగ్స్‌లో ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యింది. స్మిత్ (184), బ్రూక్ (158) సెంచరీలతో చెలరేగడంతో తొలి ఇన్సింగ్స్‌లో ఇంగ్లీష్ జట్టు 407 పరుగులు చేసింది. టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 6 వికెట్లతో నిప్పులు చెరిగాడు. బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన ఆకాష్ దీప్ 4 వికెట్లతో రాణించాడు. ఫస్ట్ ఇన్సింగ్స్‌లో ఇండియా 587 పరుగుల భారీ స్కోర్ చేయగా.. అతిథ్య జట్టు 407 రన్స్ చేసింది. దీంతో టీమిండియాకు 180 పరుగుల ఆధిక్యం లభించింది.
కాగా, 77 పరుగులకు మూడు వికెట్ల ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్.. ఆకాష్ దీప్ వేసిన తొలి ఓవర్లోనే ఒక ఫోర్‌తో ఆరు పరుగులు రాబట్టింది. ఆ తర్వాత సిరాజ్ వేసిన ఓవర్లో ఇంగ్లాండ్‌కు బిగ్ షాగింది. ఒకే ఓవర్లు రూట్, స్టోక్స్ వంటి బలమైన బ్యాటర్లను ఔట్ చేశాడు మియా బాయ్.
ALSO READ | IND VS ENG 2025: టీమిండియా కెప్టెన్ ఈజీ క్యాచ్ మిస్.. గిల్ తలకు తగిలిన బంతి
ఆ తర్వాత స్మిత్, బ్రూక్ ఇండియా బౌలర్ల జోరుకు బ్రేకులు వేశారు. ఈ ఇద్దరు బ్యాటర్లు బజ్ బాల్ క్రికెట్ ఆడుతూ ఇండియా బౌలర్లను ఊచకోత కోశారు. ఇద్దరు భారీ సెంచరీలతో చెలరేగి కష్టాల్లో ఉన్న ఇంగ్లాండ్‌ను గట్టెక్కించారు. కనీసం 200 మార్క్ దాటడం కూడా కష్టమే అనుకున్న ఇంగ్లాండ్‌ను 400 పరుగులకు చేర్చారు. ఈ దశలో 158 పరుగులు చేసి డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్న హ్యారీ బ్రూక్ ను ఔట్ చేసి ఇండియాకు బిగ్ రిలీఫ్ అందించాడు ఆకాష్ దీప్.
ALSO READ | IND VS ENG 2025: నిప్పులు చెరుగుతున్న సిరాజ్.. వరుస బంతుల్లో రూట్, స్టోక్స్ ఔట్
దీంతో ప్రమాదకరంగా మారిన బ్రూక్, స్మిత్ జోడికి బ్రేక్ పడింది. బ్రూక్ ఔటైన తర్వాత ఇంగ్లాండ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. వోక్స్ 5 పరుగులు చేసి ఔట్ కాగా, కార్సే, జోష్ టంగ్, బషీర్ ముగ్గురు డకౌట్ కావడంతో ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్సింగ్స్ ముగిసింది. 184 పరుగులతో స్మిత్ అజేయంగా నిలిచాడు. మరో ఎండ్ లో బ్యాటర్ల సహకారం లేకపోవడంతో డబుల్ సెంచరీ చేయలేకపోయాడు. సిరాజ్ 6, ఆకాష్ దీప్ 4 వికెట్లు తీశారు. ఫస్ట్ ఇన్సింగ్స్‌లో టీమిండియా 180 పరుగుల ఆధిక్యం లభించడంతో రెండో టెస్ట్‌పై భారత్ పట్టు బిగిస్తోంది.