IND vs ENG 2025: నాలుగో టెస్టులో ఇండియా బ్యాటింగ్.. మూడు మార్పులతో గిల్ సేన.. కొత్త కుర్రాడికి ఛాన్స్

IND vs ENG 2025: నాలుగో టెస్టులో ఇండియా బ్యాటింగ్.. మూడు మార్పులతో గిల్ సేన.. కొత్త కుర్రాడికి ఛాన్స్

మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్, ఇండియా మధ్య బుధవారం (జూలై 23) నాలుగో టెస్ట్ ప్రారంభమైంది. ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్ లో గిల్ టాస్ ఓడిపోవడం వరుసగా నాలుగోసారి. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఇప్పటికే ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. స్పిన్న షోయబ్ బషీర్ స్థానంలో ఆల్ రౌండర్ లియాన్ డాసన్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఇండియా ఈ మ్యాచ్ లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగుతుంది. 

కరుణ్ నాయర్ స్థానంలో సాయి సుదర్శన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ నితీష్ రెడ్డి స్థానంలో శార్దూల్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక గాయపడిన ఆకాష్ దీప్ స్థానంలో అనుషూల్ కంబోజ్ ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకొని తొలి టెస్ట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. 


భారత్ (ప్లేయింగ్ XI): 

యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అన్షుల్ కాంబోజ్

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI):

జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్