IND vs ENG 2025: ఇండియా బ్యాటింగ్.. బుమ్రా ఔట్: చివరి టెస్టుకు నాలుగు మార్పులతో గిల్ సేన

IND vs ENG 2025: ఇండియా బ్యాటింగ్.. బుమ్రా ఔట్: చివరి టెస్టుకు నాలుగు మార్పులతో గిల్ సేన

ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్ట్ గురువారం (జూలై 31) ప్రారంభమైంది. లండన్ వేదికగా కెన్నింగ్టన్ ఓవల్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్ లో ఇప్పటివరకు నాలుగు టెస్ట్ మ్యాచ్ లు జరిగితే ఇంగ్లాండ్ 2-1 తో ఆధిక్యంలో నిలిచింది. చివరి మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే సిరీస్ 2-2 తో సమం చేస్తుంది. ఈ టెస్టులో ఇంగ్లాండ్ గెలిచినా లేకపోతే డ్రా అయినా సిరీస్ కైవసం చేసుకుంటుంది. ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 ఒక రోజు ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. కెప్టెన్ స్టోక్స్ ఈ టెస్ట్ మ్యాచ్ కు దూరం కాగా.. నాలుగు మార్పులతో ఇంగ్లీష్ సేన బరిలోకి దిగుతుంది. 

టీమిండియా విషయానికి వస్తే నాలుగు మార్పులతో మ్యాచ్ ఐదో టెస్ట్ ఆడనుంది. జస్ప్రీత్ బుమ్రా దూరం కావడంతో ప్రసిద్ కృష్ణ  ప్లేయింగ్ 11 లోకి వచ్చాడు. శార్దూల్ ఠాకూర్ పై వేటు పడగా.. అతని స్థానంలో స్పెషలిస్ట్ బ్యాటర్ కరుణ్ నాయర్ తుది జట్టులోకి వచ్చాడు. పంత్ దూరం కావడంతో ధృవ్ జురెల్ ప్లేయింగ్ 11 లో చోటు సంపాదించాడు. కంబోజ్ స్థానంలో ఆకాష్ దీప్ స్థానం సంపాదించాడు.  

భారత్ (ప్లేయింగ్ XI): 

యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): 

జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జామీ ఓవర్టన్, జోష్ టంగ్ 

►ALSO READ | IND vs ENG 2025: టీమిండియాకు ఘోరమైన రికార్డ్.. వరుసగా 16 టెస్టుల్లో విజయమే లేదు