
ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా టీమిండియా గురువారం (జూలై 31) చివరి టెస్టుకు సిద్ధమవుతోంది. 1-2 తేడాతో వెనకబడిన గిల్ సేన చివరి మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. లండన్ వేదికగా ఓవల్ లో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో మన జట్టు నాలుగు మార్పులతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. జస్ప్రీత్ బుమ్రా దూరం కావడంతో ఆకాష్ దీప్ ప్లేయింగ్ 11 లో కి రానున్నాడు. శార్దూల్ ఠాకూర్ ని చివరి టెస్టులో పక్కన పెట్టి స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను ఆడించే ప్రయత్నాలు టీమిండియా చేస్తున్నట్టు సమాచారం.
ఐదో స్థానంలో పంత్ దూరం కావడంతో ధృవ్ జురెల్ ఆడడం కన్ఫర్మ్ అయిపోయింది. ఎన్నో అంచనాల మధ్య నాలుగో టెస్టులో అరంగేట్రం చేసిన అన్షుల్ కాంబోజ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. దీంతో కాంబోజ్ స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ తుది జట్టులోకి రానున్నాడు. ఈ మ్యాచ్ కు ముందు టీమిండియాకు ఒక ఘోరమైన రికార్డ్ ఆందోళనకు గురి చేస్తుంది. అదేంటో కాదు విదేశాల్లో టీమిండియా ఐదో టెస్టులో వరుసగా 16 సిరీస్ ల్లో విజయం సాధించలేదు. విదేశీ సిరీస్‌లో భారత జట్టు ఐదో టెస్ట్‌ను ఎప్పుడూ గెలవకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
►ALSO READ | ఐసీసీ టీ20 ర్యాకింగ్స్లో SRH ప్లేయర్ల హవా.. హెడ్‌ను వెనక్కి నెట్టి టాప్కు అభిషేక్
ఐదు మ్యాచ్ ల విదేశీ టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో ఓవరాల్ గా ఇండియా 16 టెస్ట్ మ్యాచ్‌లు ఆడితే 10 మ్యాచ్ ల్లో గెలిచి ఆరు డ్రా చేసుకుని, మిగిలిన 10 మ్యాచ్‌లలో ఓడిపోయింది. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ తో ఐదో టెస్టుకు సిద్ధమవుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచి వరుసగా 16 మ్యాచ్ ల్లో విజయమే లేని చెత్త రికార్డ్ కు బ్రేక్ వేయాలని చూస్తుంది. ప్రస్తుతం 4 టెస్ట్ మ్యాచ్ లు జరగగా ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. చివరి టెస్టులో ఇంగ్లాండ్ గెలిస్తే సిరీస్ సొంతమవుతుంది. మరోవైపు ఇండియా విజయం సాధిస్తే సిరీస్ సమం అవుతోంది. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా అయితే 2-1 తేడాతో ఇంగ్లాండ్ సిరీస్ గెలుచుకుంటుంది.