IND vs ENG 2025: ఆశలు మిగిలే ఉన్నాయి: రూట్, బెతేల్ ఔట్.. అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చిన టీమిండియా

IND vs ENG 2025: ఆశలు మిగిలే ఉన్నాయి: రూట్, బెతేల్ ఔట్.. అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చిన టీమిండియా

ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చింది. రూట్ (105), బ్రూక్ (111) సెంచరీలతో మ్యాచ్ మీద ఆశలు వదిలేసుకున్న మన జట్టు అదిరిపోయే ఆట ఆడింది. టీ విరామానికి ముందు బ్రూక్ ను ఔట్ చేసిన టీమిండియా ఆ తర్వాత చివరి సెషన్ లో బెతేల్ (5)తో పాటు సెంచరీ హీరో రూట్ (105)ను ఔట్ చేసి మ్యాచ్ లోకి వచ్చింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. క్రీజ్ లో ఓవర్ టన్ (0), జెమీ స్మిత్ (2) ఉన్నారు. ఇంగ్లాండ్ గెలవాలంటే మరో 35 పరుగులు  చేయాలి.

మరోవైపు టీమిండియా విజయానికి నాలుగు వికెట్లు తీస్తే సరిపోతుంది. లోయర్ ఆర్డర్ కావడంతో ఒత్తిడిలో ఇంగ్లాండ్ ను వికెట్లను తీయగలిగితే ఓడిపోయే మ్యాచ్ లో భారత్ విజయాన్ని అందుకుని సంచలనం సృష్టిస్తుంది. మరో మూడు ఓవర్ల తర్వాత కొత్త బంతి రానుంది. దీంతో ఇప్పుడు ఒత్తిడి మొత్తం ఇంగ్లాండ్ పైనే ఉంది. క్రిస్ వోక్స్ బ్యాటింగ్ కు వస్తాడో లేదో ఇంకా అధికారిక ప్రకటన లేదు. నాలుగో రోజు చివరి సెషన్ లో ఇంగ్లాండ్ విజయానికి 57 పరుగులు అవసరం కాగా ఈ సెషన్ ప్రారంభంలోనే బెతేల్ 5 పరుగులే చేసి ప్రసిద్ కృష్ణ బౌలింగ్ లో బౌల్డయ్యాడు.  

Also Read : వెటరన్ క్రికెటర్ల కథ ముగిసినట్టేనా

సెంచరీ చేసి జోరు మీదున్న రూట్ ను ప్రసిద్ కృష్ణ ఔట్ చేయడంతో టీమిండియాకు గెలుపుపై ఆశలు చిగురించాయి. 105 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. ఆ ఆతర్వాత మన బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 20 బంతుల్లో 2 పరుగులు మాత్రమే వచ్చాయి. ఈ దశలో బ్యాడ్ లైట్ కారణంగా ఆటను అంపైర్లు నిలిపివేశారు. ఆ తర్వాత వర్షం కురవడంతో మ్యాచ్ ఐదో రోజుకు వెళ్ళింది. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 224 పరుగులకు ఆలౌట్ అయితే.. ఇంగ్లాండ్ 247 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో ఇండియా 396 పరుగులకు ఆలౌట్ అయింది.