IND vs ENG 2025: చేజారుతున్న ఓవల్ టెస్ట్.. బ్రూక్, రూట్ భాగస్వామ్యంతో ఓటమి దిశగా టీమిండియా

IND vs ENG 2025: చేజారుతున్న ఓవల్ టెస్ట్.. బ్రూక్, రూట్ భాగస్వామ్యంతో ఓటమి దిశగా టీమిండియా

ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా ఓటమి దిశగా పయనిస్తోంది. ఏదైనా అద్బుతంగా జరిగితే తప్ప ఈ మ్యాచ్ లో ఇంగ్లాడ్ విజయం ఖాయంగా కనిపిస్తుంది. బ్రూక్, రూట్ భారీ భాగసామ్యంతో భారత ఆశలపై నీళ్లు చల్లారు. నాలుగో రోజు రెండో సెషన్ లో బ్రూక్ (111) అద్భుత సెంచరీకి తోడు.. రూట్ (98) హాఫ్ సెంచరీ చేయడంతో ఇంగ్లాండ్ విజయం దిశగా దూసుకెళ్తుంది. నాలుగో రోజు టీ విరామ సమయానికి ఇంగ్లాండ్ 4 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. క్రీజ్ లో రూట్ (98), బెతేల్ (1) ఉన్నారు. ఇంగ్లాండ్ విజయానికి కేవలం 57 పరుగులు అవసరం. 

మరోవైపు టీమిండియా విజయం సాధించాలంటే 6 వికెట్లు తీయాలి. నాలుగో రోజు రెండో సెషన్ లో ఇండియా ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టింది. దీంతో మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు మొగ్గింది. రూట్, బ్రూక్ ఇద్దరూ మూడో వికెట్ కు 195 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నిర్మించి జట్టును విజయ తీరాలకు చేర్చారు. 3 వికెట్ల నష్టానికి 164 పరుగులతో రెండో సెషన్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఏకంగా 153 పరుగులు రాబట్టడం విశేషం. ఈ సెషన్ లో బ్రూక్ సెంచరీతో ఆకట్టుకోగా.. రూట్ సెంచరీకి దగ్గరలో ఉన్నాడు.    

Also Read : క్యాచ్ పట్టి బౌండరీ టచ్ చేసిన సిరాజ్

నాలుగో రోజు తొలి సెషన్ లలో ఇంగ్లాండ్ 114 పరుగులు రాబడితే టీమిండియా రెండు వికెట్లు పడగొట్టింది. రెండో సెషన్ లో ఇంగ్లాండ్ 111 పరుగులు చేసి ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. భారత బౌలర్లలో సిరాజ్ కు రెండు వికెట్లు దక్కాయి. ప్రసిద్ కృష్ణ, ఆకాష్ దీప్ ఒక వికెట్ తీసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 224 పరుగులకు ఆలౌట్ అయితే.. ఇంగ్లాండ్ 247 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో ఇండియా 396 పరుగులకు ఆలౌట్ అయింది.