- ఇంటర్ విద్యాజేఏసీ చైర్మన్ మధుసూధన్ రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: గత విద్యా సం వత్సరం (2023–24) ఇంటర్ ఫస్టియర్ లో ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలను రద్దు చేయాలని ఇంటర్ విద్యాజేఏసీ చైర్మన్ మధుసూధన్ రెడ్డి కోరారు. ఇంటర్ బోర్డు లోని అకాడమిక్ కమిటీ నిర్ణయం తీసుకో కుండానే ఈ పరీక్షలు ప్రారంభించడం సరికాదన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థుల మధ్య వైరుధ్యాలను దృష్టిలో పెట్టు కోకుండా.. గత ప్రభుత్వం నిర్ణయం తీసు కుందని విమర్శించారు.
మార్చిలో జరిగిన పబ్లిక్ పరీక్షల్లో ఇంగ్లీష్ ఎగ్జామ్ 4,30,178 మంది రాశారని తెలిపారు. ఇంగ్లీష్ ప్రాక్టిక ల్స్‌లో 20కి 20 మార్కులను 2,19,822 మంది పొందారని తెలిపారు. కానీ, వారిలో 3641 మంది థియరీలో ఫెయిల్ అయ్యారని వెల్లడించారు. ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ లో పాసైన వారిలో మొత్తం 28,537 మంది థియరీలో ఫెయిల్ అయ్యా రని చెప్పారు.
