ఎంసెట్ ఎంట్రెన్స్ డేట్స్ ఫిక్స్

ఎంసెట్ ఎంట్రెన్స్ డేట్స్ ఫిక్స్

వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిలీజ్ చేశారు. మే 7 నుంచి 14 వరకు ఎంసెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. మే7 నుంచి 11 వరకు ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష, మే12 నుంచి 14 వరకు ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్ష జరగనుంది.  ఇక  మే 18న ఎడ్‌సెట్‌, మే 20న ఈసెట్‌, మే 25న లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌,  మే 26న ఐసెట్‌, మే 29 నుంచి జూన్‌1 వరకు పీజీఈసెట్‌ పరీక్షలను నిర్వహించనున్నారు.  పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అధికారులందరూ సమిష్టిగా కృషి చేయాలని మంత్రి సూచించారు. దరఖాస్తు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫీజు ఇతర వివరాలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్  ను సంబంధిత సెట్ కన్వీనర్లు ప్రకటిస్తారని మంత్రి తెలిపారు.