సగం మ్యాచుల్లోనే ధోని రికార్డు బ్రేక్!!

సగం మ్యాచుల్లోనే ధోని రికార్డు బ్రేక్!!

అత్యధిక సిక్సర్‌‌లు కొట్టిన కెప్టెన్‌గా మోర్గాన్
సౌతాంప్టన్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డును ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బద్దలుకొట్టాడు. కెప్టెన్‌గా అత్యధిక సిక్సులు కొట్టిన ధోని రికార్డును ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో మోర్గాన్ బ్రేక్ చేశాడు. 328 ఇంటర్నేషనల్ సిక్సులు కొట్టిన మోర్గాన్‌.. మంగళవారం ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో కెప్టెన్‌గా 212వ సిక్సును కొట్టాడు. సారథిగా ధోని 332 మ్యాచుల్లో 211 సిక్సులు కొట్టాడు. మరోవైపు మోర్గాన్ 163 మ్యాచుల్లోనే 212 సిక్సులు కొట్టడం విశేషం. అయితే అన్ని ఫార్మాట్‌లను కలుపుకుంటే మోర్గాన్ కంటే ధోని సిక్సులు విషయంలో ముందున్నాడు. టెస్టులు, టీ20, వన్డేలను కలుపుకుంటే ధోని 359 సిక్సులు కొట్టగా.. మోర్గాన్ 328 కొట్టాడు. కెప్టెన్‌గా అత్యధిక సిక్సుల విషయంలో రికీ పాంటింగ్ 171 సిక్సులు మూడో ప్లేస్‌లో ఉన్నాడు. నాలుగో స్థానంలో కివీస్ మాజీ కెప్టెన్, విధ్వంసక ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ నిలిచాడు.