
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కొత్తగా చేరిన సభ్యుల వివరాలను వెల్లడించింది. 2025 మార్చిలో మొత్తం 7.54 లక్షల మంది సభ్యులు చేరినట్లు తెలిపింది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 1.15 శాతం ఎక్కువ. ఇది ఉద్యోగాల్లో పెరుగుదల, సామాజిక భద్రతా ప్రయోజనాలపై అవగాహన పెరుగుదలను సూచిస్తుంది.
2025 మార్చిలో దాదాపు 7.54 లక్షల మంది కొత్త సబ్ స్క్రైబర్లు EPFO లో చేరారు. ఇది ఫ్రిబ్రవరితో పోలిస్తే 2.03 శాతం ఎక్కువ, అదే 2024 మార్చితో పోలిస్తే 0.98 శాతం ఎక్కువ.
ఈ డేటా లేబర్ శక్తిలో యువత పాత్రను హైలైట్ చేస్తుంది. 18-25 ఏళ్ల మధ్య వయసు గల 4.45 లక్షల మదంది కొత్త సభ్యులుగా ఉన్నారు. 2025 మార్చిలో కొత్తగా చేరిన వారిలో ఇది దాదాపు 59 శాతం.
ఇది గత నెలతో పోలిస్తే 4.21 శాతం,మార్చి 2024 తో పోలిస్తే 4.73 శాతం పెరుగుదలను సూచిస్తుంది. మొత్తంగా ఈ వయస్సు వర్గం నుంచి6.68 లక్షల నికర చేరికలు వచ్చాయి. ఇది అధికారికంగా ఉద్యోగంలో చేరే ధోరణిని సూచిస్తోంది.గతంలో EPFO నుంచి తప్పుకున్న 13.23 లక్షల మంది సభ్యులు మార్చి 2025లో తిరిగి చేరారు.