డిగ్రీ అర్హత: EPFO లో జాబ్స్ నోటిఫికేషన్

డిగ్రీ అర్హత: EPFO లో జాబ్స్ నోటిఫికేషన్

డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్న వారికి శుభవార్త. న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మే 30 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.

అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో జూన్ 25 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రెండంచెల (ప్రిలిమ్స్, మెయిన్స్) రాతపరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జులై 30, 31 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను 1: 10 నిష్పత్తిలో మెయిన్ పరీక్షకు ఎంపికచేస్తారు.

మొత్తం 280 అసిస్టెంట్ పోస్టులకు ఖాళీలు ఉన్నట్టు EPFO తెలిపింది. అందులో కేటగిరీల వారీగా జనరల్ కు 113 పోస్టులు, EWS – 28, SC-42, ST-21, OBC(NCL)- 76 పోస్టులు ఉన్నట్టు ప్రకటించింది. ఈ మొత్తంలో 11 పోస్టులను దివ్యాంగులకు కేటాయించింది.

అర్హత‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వ‌యోపరిమితి: 25.06.2019 నాటికి 20 – 27 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళలు, దివ్యాంగులు, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక‌ విధానం: ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ఆన్‌లైన్ పరీక్షల ద్వారా.

స్కేల్ పే: రూ.44,900. ఇతర భత్యాలు అదనం.

పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా మొత్తం 42 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరబాద్, గుంటూరు నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.