స్కూల్ యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలి : ఎర్ర అఖిల్ కుమార్

స్కూల్ యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలి : ఎర్ర అఖిల్ కుమార్

సూర్యాపేట, వెలుగు : అనుమతులు లేకుండా అడ్మిషన్స్ తీసుకుంటున్న శ్రీచైతన్య స్కూల్స్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పీడీ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూ  రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న స్కూల్స్ ను సీజ్ చేయాలని కోరుతూ మంగళవారం డీఈవో అశోక్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట, నేరేడుచర్లలో ఎలాంటి అనుమతి లేకుండా శ్రీచైతన్య స్కూల్​ను నడిపిస్తున్నారని తెలిపారు. 

ప్రతిసారి శ్రీచైతన్య విద్యాసంస్థలు అనుమతులు లేకుండా కొత్త బ్రాంచీలను ప్రారంభిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. కార్పొరేట్ విద్య పేరుతోటి లక్షల రూపాయల ఫీజులు వసూళ్లు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అక్రమంగా అడ్మిషన్స్ చేస్తున్న శ్రీచైతన్య స్కూల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని,  లేదంటే పీడీ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. వినతిపత్రం ఇచ్చినవారిలో నాయకులు సూరం విజయ్ రెడ్డి, వీరబాబు తదితరులు ఉన్నారు.