బతుకమ్మ చీరలపై తప్పుడు ప్రచారం చేస్తున్రు

బతుకమ్మ చీరలపై తప్పుడు ప్రచారం చేస్తున్రు

హనుమకొండ : బతుకమ్మ చీరలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చే బతుకమ్మ చీర రేటు చూడొద్దని, ఆయన ఇచ్చే కానుకగా భావించాలని కోరారు. హనుమకొండ కలెక్టరేట్ లో దసరా కమిటీలతో మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి.. మహిళలు చీరలు నచ్చకపోతే తీసుకోకుండా ఉండాలే తప్ప వాటిని కాలబెట్టొద్దని సూచించారు. చీరలు కాలబెట్టిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. దసరా ఉత్సవ ఏర్పాట్లల్లో గతంలో లోపాలు జరిగాయని, అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

అనంతరం మాట్లాడిన మంత్రి సత్యవతి రాథోడ్  బతుకమ్మ, దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. కొందరు రాజకీయ లబ్ది కోసం బతుకమ్మ చీరలు కాల్చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బతుకమ్మ కుంటలతో పాటు ప్రభుత్వ స్థలాలకు రక్షణ గోడలు ఏర్పాటు చేసి కాపాడాలని అధికారులకు సూచించారు.