
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పెండింగ్ లో ఉన్నా కిషన్ రెడ్డి మాట్లాడటం లేదన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్. వరంగల్ కు కిషన్ రెడ్డి పొలిటికల్ ఎటాక్ కోసమే వచ్చినట్లు ఉందని చెప్పారు. కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తున్నాయనే..వరంగల్ కు వచ్చారని విమర్శించారు. ట్రైబల్ యూనివర్శిటీ కేంద్రం ఎందుకు ఏర్పాటు చేయలేదో చెప్పాలన్నారు . టెక్స్ టైల్ పార్క్ కు సాయం చేయలేదని, బయ్యారం ఉక్కు పరిశ్రమ హామీ నెరవేర్చలేదని ఎర్రబెల్లి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం ఒక్కపైసా సాయం చేయలేదని మండిపడ్డారు. వరంగల్ లో వందశాతం వరద సాయం చేశామని, తాము చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్నారు ఎర్రబెల్లి దయాకర్.