బాలవికాస స్ఫూర్తితోనే పల్లె ప్రగతి కార్యక్రమం : మంత్రి ఎర్రబెల్లి 

బాలవికాస స్ఫూర్తితోనే పల్లె ప్రగతి కార్యక్రమం : మంత్రి ఎర్రబెల్లి 

వరంగల్ : సేవా కార్యక్రమాలతో ప్రభుత్వాలకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఏకైక సంస్థ బాలవికాస స్వచ్ఛంద సంస్థ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత వరుసగా ఏడుసార్లు తన గెలుపునకు, రాజకీయ ఎదుగుదలకు బాలవికాస సంస్థ ప్రోత్సాహం ఎంతో ఉందని చెప్పారు. బాలవికాస స్ఫూర్తితోనే పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టామని వివరించారు. బాలవికాస స్ఫూర్తితో సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ చేపట్టి ఇంటింటికి తాగునీరు అందిస్తున్నారని, ఇది చూసి కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం అమలు చేయాలని రాష్ట్రానికి అవార్డు ఇచ్చిందన్నారు. బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆవిర్భావ వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు.  

పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించడం తన అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్​ లో తెలంగాణలోని గ్రామాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. కేసీఆర్ ను ఒప్పించి సర్పంచులకు గ్రామాల అభివృద్ధిపై బాలవికాస స్వచ్ఛంద సంస్థ ద్వారా శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు.