రాష్ట్రానికి వ్యాక్సిన్ సరఫరా విషయంలో కేంద్రం సహకరించట్లేదు

రాష్ట్రానికి వ్యాక్సిన్ సరఫరా విషయంలో కేంద్రం సహకరించట్లేదు

రాష్ట్రానికి వ్యాక్సిన్ సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. హైదరాబాద్ కు కరోనా ట్రీట్ మెంట్ కోసం దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి పేషెంట్లు రావడం ఎక్కువైందన్నారు. కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, వైద్య సేవలపై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, MLAలు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..వరంగల్ ఎంజీఎంలో 80 వెంటిలేటర్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం 659 మంది కరోనా పేషెంట్స్ కొవిడ్ వార్డులో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఆక్సిజన్, రెమ్ డెసివిర్ ఇంజక్షన్లకు  కొరత లేదన్నారు. ఆస్పత్రుల్లో హెల్ప్ డెస్క్ లు, హెల్ప్ లైన్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమాచారం కోసం హెల్ప్ లైన్ నెంబర్  7901618231 కు కాల్ చేయాల్సిందిగా చెప్పారు.

అంతేకాదు వరంగల్ సెంట్రల్ జైల్ ను ధర్మసాగర్ సమీపంలోకి తరలిస్తున్నామని..ఏడాదిలో కొత్త సెంట్రల్ జైల్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు ఎర్రబెల్లి. ప్రస్తుతం సెంట్రల్ జైల్ లో ఉన్న 76 ఎకరాల స్థలంలో అత్యాధునిక టెక్నాలజీతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశించారని తెలిపారు. దీనికి సంబంధించి అయిదుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామన్నారు. KMC సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం 8కోట్లు విడుదల చేసిందన్నారు.250 బెడ్స్ తో నాన్ కొవిడ్ సేవలు సిద్ధంగా ఉన్నాయన్నారు. 363మంది డాక్టర్లు, ఇతర సిబ్బంది నియామకం 15రోజుల్లోగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్, మండల కేంద్రాల్లో కరోనా పేషేంట్ల సేవలకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి.