కేసీఆర్ వస్తే కన్న తల్లిదండ్రులు వచ్చినట్లుంది : ఎర్రబెల్లి

కేసీఆర్ వస్తే కన్న తల్లిదండ్రులు వచ్చినట్లుంది : ఎర్రబెల్లి

మహబూబాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్ వస్తే కన్న తల్లిదండ్రులు వచ్చినట్లు అనిపిస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఎడారి లాంటి ప్రాంతాల్లో నీళ్లు పారిస్తున్న భగీరథుడు కేసీఆర్ అని సీఎంపై ప్రశంసలు కురింపించారు. ఒకప్పుడు తండాలు, గ్రామాల్లో బిందెలు నెత్తి మీద పెట్టుకుని నీళ్లు మోసుకునే వాళ్లమని.. ఇప్పుడు బిందెలతో క్యూలు కట్టే రోజులు పోయాయని అన్నారు. కేసీఆర్ నిర్ణయం వల్ల ప్రస్తుతం ప్రతి ఇంట్లో నల్లా కనెక్షన్లు ఉన్నాయని చెప్పారు. తండాల అభివృద్ధి కోసం వాటిని గ్రామ పంచాయతీలుగా మార్చారని చెప్పారు.

40 ఏళ్లుగా తాను మహబూబాబాద్‭లోనే ఉన్నానని..  అప్పట్లో వ్యవసాయం చేసినప్పుడు నీళ్లు ఉండేవి కాదని ఎర్రబెల్లి చెప్పారు. ఎడారిలాంటి ప్రాంతాల్లో.. కేసీఆర్ దయవల్ల ఎండాకాలంలో కూడా చెరువుల్లో నీళ్లు పారుతున్నాయని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా గోదావరి, కృష్ణా జలాలను ఫిల్టర్ చేసి జనం దాహార్తిని తీరుస్తున్నారని చెప్పారు.