మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సర్పంచుల అవగాహన సదస్సులో గొడవ జరిగింది. సదస్సుకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. దీంతో సమస్యలు పరిష్కరించాలని చలో పాలమూరు చేపట్టారు సర్పంచులు. మంత్రుల మీటింగ్ కు వెళ్లకుండా సమావేశం బయటే నిలబడి నిరసన తెలిపారు. సర్పంచుల తీరుపై మంత్రి ఎర్రబెల్లి అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది కావాలని గొడవ చేయాలని చూస్తున్నారని అన్నారు. సర్పంచుల బాధలు వినాలనే వచ్చామని.. వద్దంటే వెళ్లి పోతామన్నారు ఎర్రబెల్లి. సమస్యలపై చర్చిద్దామని సర్పంచులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆహ్వానించడంతో సమావేశంలో పాల్గొన్నారు సర్పంచులు.
see more news
చంచల్ గూడ జైలు నుంచి అఖిలప్రియ విడుదల
రామమందిర నిర్మాణానికి నేతల విరాళాలు..ఎవరెవరు ఎంతంటే?
మే 17 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ..

