భద్రత తొలగింపుపై హైకోర్టులో ఎర్రబెల్లి ప్రదీప్ రావు పిటిషన్ 

భద్రత తొలగింపుపై హైకోర్టులో ఎర్రబెల్లి ప్రదీప్ రావు పిటిషన్ 

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు సెక్యూరిటీ తొలగింపుపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే భద్రత తొలగించారని ఎర్రబెల్లి ప్రదీప్ రావు పిటిషన్ లో పేర్కొన్నాడు. గతంలో కోర్టు ఆదేశాలతో ప్రదీప్ రావుకు భద్రత కల్పించారు. ప్రస్తుతం పోలీసులు తనకు భద్రత ఎందుకు తొలగించారో తెలియదని పిటిషన్ లో వివరించాడు. తనకు 2+2 భద్రత కల్పించేలా చూడాలని న్యాయస్థానాన్ని కోరాడు.