ఎర్ర కారం.. చాలా టేస్ట్​ గురూ

V6 Velugu Posted on Oct 14, 2021

  • డిఫరెంట్ కాన్సెప్ట్​తో రెస్టారెంట్ 
  • నోరూరించే  రెసిపీలు  

 హైదరాబాద్, వెలుగు:  కారం రుచులతో డిఫరెంట్ ​కాన్సెప్ట్​తో ఎర్రకారం రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. పల్లె రుచులను పట్నం వాసులకు అందించాలనే ఉద్దేశంతో సిటీకి చెందిన శశాంక్  కొత్త కాన్సెప్ట్ తో రెస్టారెంట్ ని ఓపెన్​ చేశారు. జూబ్లీహిల్స్  వెంకటగిరి, రోడ్ నం 10 లో  బార్ అండ్ రెస్టారెంట్ ఉంటుంది.  ఇక్కడ డైన్ ఇన్ తో పాటు టేక్ అవే ఫెసిలిటీ కూడా ఉంది. 

నోరూరించే కారాలతో..

రెస్టారెంట్ లో ప్రతి రెసిపీ ఫుల్ స్పైసీగా ఉంటుంది.  ఊర్లలోని వంటల్లో ఉండే ఘాటును ఇక్కడ ఫీల్ అవ్వొచ్చు.  తెలంగాణ, ఆంధ్ర లోని సంప్రదాయ వంటకాలు రెస్టారెంట్ లో అందుబాటులో ఉన్నాయి. రాగి సంగటి, మాంసం సెనగపప్పుతో పాటు కడప కోడి, జీడి పప్పు ఫ్రై, తవా చేప, రొయ్య కొత్తి మీర వేపుడు, గోలిచ్చిన మాంసం వేపుడు, గుత్తి వంకాయ కూర, మష్రూమ్ అండ్ కాప్సికం ఇగురు, కోడి గుడ్డు పులుసు, గుంటురు కోడి ఇగురు, నెల్లూరు చేపల పులుసు, కరివేపాకు రొయ్యల తాలింపు, కుర్మా కర్రీ, కేరళ కొకనట్ కర్రీ, చెట్టినాడ్ కర్రీ, భీమవరం ప్రాన్స్ అండ్ మసాలా పలావ్, రాజుగారి కోడి పలావ్​, నల్లకారం తంగడి కబాబ్, పుదీనామిర్చి ఫిష్ టిక్కా.. రైస్ రెసీపీల నుంచి కర్రీలు, బిర్యానీలు, స్టార్టర్లు, కబాబ్స్ లు ఇలా అన్నీ స్పైసీ గా రెస్టారెంట్​లో నోరూరిస్తాయి. వీటితో పాటు కాక్ టైల్స్, విస్కీ అండ్ బార్ బన్, వోడ్కా, జిన్, టెకిలా, రమ్, లిక్కర్, ఇంపోర్టెడ్ బీర్స్, డొమెస్టిక్ బీర్స్, ఇంపోర్టెడ్ వైన్స్, డొమెస్టిక్ వైన్స్, కాఫీ, టీ, మిల్క్ షేక్స్, బేవరేజెస్ డిఫరెంట్ వెరైటీల్లో లభిస్తాయి.

మర్చిపోతున్న రుచులను గుర్తు చేసేందుకే..

మన ఫుడ్ రెసీపీల పేర్లు చాలా అథెంటిక్ గా ఉంటాయి. అందుకే రెస్టారెంట్ కి ఎర్రకారం అని పేరుపెట్టాం.  అన్ని రకాల రెసీపీలు అందుబాటులో ఉంటాయి. చెఫ్స్ అందరూ తెలుగువాళ్లే.  వారికి ప్రతి రెసిపీ ఎలా చేయాలో తెలుసు. రెస్టారెంట్ స్టార్ట్ చేసి వారం అయింది. మంచి రెస్పాన్స్ వస్తుంది. బార్ అండ్ రెస్టారెంట్ రెండూ అందుబాటులో ఉంటాయి. యూత్​ మర్చిపోతున్న రుచులను గుర్తు చేయాలనే కొత్తగా ట్రై చేశాం.                                 ‑ శశాంక్, కో ఓనర్, ఎర్రకారం రెస్టారెంట్ 

Tagged Hyderabad, , Tasty Food, Errakaram Restaurant, different concept

Latest Videos

Subscribe Now

More News