- డీఈడీ, బీఈడీ అభ్యర్థుల సంఘం విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టెట్‌లోని లోపాలను సవరించాలని డీఈడీ, బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రాంమోహన్ రెడ్డి కోరారు. టెట్ పేపర్ 2 బయాలజీలో గణిత సబ్జెక్ట్ ఇవ్వడంతో అభ్యర్థులకు నష్టం జరుగుతుందన్నారు. కాబట్టి గణిత సబ్జెక్ట్‌ను తొలగించాలని ఒక ప్రకటనలో కోరారు. భాషా పండితులకు స్పెషల్ టెట్ నిర్వహించాలని సూచించారు. పేపర్1 పరిధి 8వ తరగతిలోపు, పేపర్2 పరిధి పదో తరగతిలోపే ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా టెట్‌లో సడలింపు ఇవ్వాలన్నారు.
