జైలు నుంచే ప్లాన్..జబల్పూర్‌లో14 కేజీల బంగారం దోపిడీ కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి

జైలు నుంచే ప్లాన్..జబల్పూర్‌లో14 కేజీల బంగారం దోపిడీ కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి

మధ్యప్రదేశ్లోని జబల్పూర్ ప్రైవేట్ బ్యాంకులో 14 కిలోల బంగారం చోరీ కేసులు పోలీసులు ఛేదించారు. గురువారం( ఆగస్టు14) ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. చోరీకి మొత్తం స్కెచ్ జైలునుంచే జరిగింది..ప్రధాన సూత్రధారి రయీస్  సింగ్ అని పోలీసులు తేల్చారు. ఇటీవల ఒడిశా జైలు నుంచి విడుదలైన రయీస్ సింగ్.. జైలులో ఉండగానే తన సహచరులతో జబల్పూర్ ESAF ఫైనాన్స్ బ్యాంక్ దోపిడీకి ప్లాన్ వేసినట్లు పోలీసులు చెబుతున్నారు. 

ఈ ప్లాన్అమలు చేసేందుకు రయీస్సింగ్ బీహార్‌కు చెందిన పేరుమోసిన నేరస్థులతో జట్టుకట్టాడు.. తన సహచరుడు సోను బర్మాన్ సహాయంతో ఇంద్రాన గ్రామంలో ఒక గదిని అద్దెకు తీసుకుని రుణ రికవరీ ఏజెంట్‌గా నటిస్తూ వారితో కలిసిపోయాడు..అతను ప్రతిరోజూ బ్యాంకు కదలికలను నిశితంగా గమనించాడని పోలీసులు చెబుతున్నారు. 

అనుకున్నట్లుగానే సోమవారం (ఆగస్టు 11) పోలీసులను ,భద్రతా వ్యవస్థలను మభ్యపెట్టి కేవలం 20 నిమిషాల్లోనే 14.5 కిలోల బంగారం ,రూ.5 లక్షల నగదుతో తప్పించుకోగలిగారు.

గత 10 రోజులుగా 4-5 మంది యువకులు గ్రామంలో నివసిస్తున్నారు..ఎల్లప్పుడూ హెల్మెట్లు ధరించి ఉదయం నుంచి రాత్రి వరకు బైక్‌లపై తిరుగుతున్నారని ఇంద్రాన గ్రామస్థులు చెప్పడంతో గ్రామానికి చెందిన జితేంద్ర ఝరియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని ఇంట్లో నంబర్ ప్లేట్ లేని బైక్, పిస్టల్,అనుమానాస్పద వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

దొంగిలించబడిన బంగారం దొరికిందా లేదా అని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు..కానీ కొన్ని కీలకమైన ఆధారాలు దొరికాయని తెలుస్తోంది. దోపిడీ తర్వాత, నిందితులందరినీ పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.