ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. అలాగే ఈ కేసులో మిగిలిన నిందితులకు సంబంధించి బెయిల్ పిటిషన్లను కూడా కోర్టు డిస్మిస్ చేసింది. మందుల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై గత నెల 12న అచ్చెన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఆయన బెయిల్ పిటిషన్ ఏబీసీ కోర్టు తిరస్కరించగా.. ఇప్పుడు హైకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. అచ్చెన్నాయుడు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం వాదనలు ముగిశాయి. న్యాయమూర్తి జస్టిస్ ఎం.వెంకటరమణ చేపట్టిన విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, ఏసీబీ తరఫున అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరాం వాదనలు వినిపించారు. ఇరువురి వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. తీర్పును రిజర్వ్ చేశారు. ఇదే కేసులో ఏ1గా ఉన్న ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ సీకే రమేశ్‌కుమార్ బెయిల్ పిటిషన్‌పైనా సోమవారం విచారణ జరిగింది. ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేయగా.. అన్ని పిటిషన్ల తీర్పును ఇవాళ వెల్లడించింది హైకోర్టు.
ఈఎస్ఐ స్కామ్: అచ్చెన్నాయుడికి బెయిల్ తిరస్కరించిన హైకోర్టు
- ఆంధ్రప్రదేశ్
- July 29, 2020
లేటెస్ట్
- ఫోన్ వాడొద్దని చెప్పినందుకు అన్నను గొడ్డలితో నరికి చంపిన 14ఏళ్ల బాలిక
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- సమ్మర్ స్పెషల్ ప్రూట్.. తాటిముంజలు.. ఇవి ఎన్ని లాభాలో...
- Samyuktha Menon: మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్న సంయుక్త మీనన్.. హీరో ఎవరో తెలుసా?
- ఇది పాలమూరు ఆత్మగౌరవ ఎన్నిక : వంశీచంద్‌రెడ్డి
- మహిళా డిగ్రీ కాలేజీ తేలేని అసమర్థుడు జగదీశ్ రెడ్డి : రాంరెడ్డి దామోదర్ రెడ్డి
- ఇవాళ అయోధ్యలో మోదీ రోడ్ షో
- ఫారెస్ట్ ఆఫీసర్ల అదుపులో ఇద్దరు వేటగాళ్లు
- స్ట్రాంగ్ రూమ్, మీడియా సెంటర్ల పరిశీలన
Most Read News
- GT vs RCB: గుజరాత్‌తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు