ఏపీలో పెట్టుబడులకు ముందుకొచ్చిన ఎస్సార్ గ్రూప్

ఏపీలో పెట్టుబడులకు ముందుకొచ్చిన ఎస్సార్ గ్రూప్
  • కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సముఖత
     

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఎస్సార్ గ్రూప్ ముందుకొచ్చింది. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత ప్రకటించింది. బుధవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను ఎస్సార్ గ్రూప్ ప్రతినిధులు  కలిశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఎస్సార్ గ్రూపు సన్నద్దతను వ్యక్తం చేసింది. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు నవంబర్ లో శంకుస్థాపనకు ప్రభుత్వం సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఎస్సార్ గ్రూప్ ప్రతినిధులు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం జగన్ ను కలిసిన వారిలో ఎస్సార్ గ్రూప్ హెడ్‌‌ ప్రశాంత్ రుయా, వైస్ ఛైర్మన్ జె మెహ్రా తదితరులు ఉన్నారు. సమావేశంలో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి కూడా పాల్గొన్నారు.