విమోచన ఉద్యమం, త్యాగాలు, ఇబ్బందులపై ఉపన్యాస పోటీలు

విమోచన ఉద్యమం, త్యాగాలు, ఇబ్బందులపై ఉపన్యాస పోటీలు

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 17న హైదరాబాద్ విమోచన ఉద్యమం, త్యాగాలు, ఇబ్బందులు అనే అంశంపై గవర్నర్ తమిళిసై ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ కాంపిటీషన్ లో పాల్గొనేవాళ్లు ఈ నెల 16న సాయంత్రం 5 గంటలలోగా పేర్లు నమోదు చేసుకోవాలని బుధవారం రాజ్ భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. 9542124646 నంబర్ కు వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్, rbhldelocutioncontest@gmail.com వెబ్​సైట్​కు పేర్లు పంపాలని వెల్లడించింది. 3 నిమిషాల పాటు స్పీచ్ ఇవ్వాల్సి ఉంటుందని, ముందుగా నమోదు చేసుకున్న 60 మందికి 17న రాజ్ భవన్ లో కాంపిటీషన్ ఉంటుందని తెలిపింది.

మొదటి ముగ్గురు విన్నర్లకు రూ. 12,500, రూ.7500, రూ.5000, మరో 10 కన్సోలేషన్ ప్రైజ్​లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఏపీ రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీ కృపానంద్ త్రిపాఠి..గవర్నర్ తమిళిసైని రాజ్ భవన్ లో కలిశారు. ఈ ఏడాది జులై 22 న వారణాసి నుంచి హైదరాబాద్ ఫ్లైట్​లో వస్తున్న త్రిపాఠికి హెల్త్ ప్రాబ్లమ్ ఉంటే అదే ఫ్లైట్​లో ప్రయాణిస్తున్న గవర్నర్ ట్రీట్​మెంట్ చేశారు. తనకు ట్రీట్ మెంట్ చేసినందుకు గవర్నర్​కు త్రిపాఠి థ్యాంక్స్​ చెప్పారు.