రాష్ట్రంలో కొత్త జిల్లాలకు నెహ్రూ యువ కేంద్రాలను ఏర్పాటు చేయండి 

రాష్ట్రంలో కొత్త జిల్లాలకు నెహ్రూ యువ కేంద్రాలను ఏర్పాటు చేయండి 

నెహ్రూ యువ కేంద్రాలను కొత్త జిల్లాలకు విస్తరించాలంటూ.. కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ లేఖ రాశారు. అంతేకాదు..జిల్లా కోఆర్డినేటర్స్ ను తక్షణమే నియమించాలని లేఖ లో కోరారు. తెలంగాణలో పాత జిల్లాలకే పరిమితమైన నెహ్రూ యువజన కేంద్రాలను కొత్త జిల్లాలకు విస్తరించాలన్నారు. నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ కేంద్రాలను విస్తరించాలని కరీంనగర్ కు చెందిన సామాజిక కార్యకర్త ఎ.కిరణ్ కుమార్ చేసిన అభ్యర్ధన మేరకు బండి సంజయ్ కేంద్ర మంత్రికి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో 10 జిల్లాలు మాత్రమే ఉండగా ఆయా జిల్లాలకు మాత్రమే నెహ్రూ యువజన కేంద్రాలు పరిమితమయ్యాయన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జిల్లాల సంఖ్య 33కు చేరిందన్నారు. తెలంగాణలో కొత్తగా మరో 23 జిల్లాలు అదనంగా ఏర్పాటైనందున ఆయా జిల్లాల్లోనూ నెహ్రూ యువజన కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు ప్రతి జిల్లా ప్రధాన కార్యాలయంలోనూ జిల్లా సమన్వయకర్తలను వెంటనే నియమించాలని కోరారు.