గాంధీలో అవయవ మార్పిడి కేంద్రం

గాంధీలో అవయవ మార్పిడి కేంద్రం

హైదరాబాద్, వెలుగు: గాంధీ హాస్పిటల్‌‌‌‌లో స్టేట్‌‌‌‌ ఆర్గాన్ ట్రాన్స్‌‌‌‌ప్లాంట్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఇక్కడ లివర్ ట్రాన్స్‌‌‌‌ప్లాంట్ సెంటర్‌‌‌‌‌‌‌‌ మాత్రమే ఏర్పాటు చేయాలని భావించారు.  దీనికి సంబంధించి 2018లోనే ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి జీవోను సవరించి, కొత్త జీవోను బుధవారం ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సెంటర్ ఏర్పాటుకు రూ.20 కోట్లు మంజూరు చేస్తూ మరో జీవో జారీ చేసింది. లివర్, కిడ్నీ సహా అన్ని రకాల ట్రాన్స్‌‌‌‌ప్లాంటేషన్స్‌‌‌‌ చేసేలా ఈ సెంటర్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు. ప్రస్తుతం నిమ్స్‌‌‌‌ కేంద్రంగా జీవన్‌‌‌‌దాన్ ట్రస్ట్ నడుస్తోంది. గాంధీలో సెంటర్ ప్రారంభమైతే,  జీవన్‌‌‌‌దాన్ వ్యవహారాలన్నీ షిఫ్ట్ చేయాలని నిర్ణయించారు.