ఉక్రెయిన్ లోని తెలంగాణ వారి కోసం హెల్ప్‌లైన్‌ నెంబర్లు

ఉక్రెయిన్ లోని తెలంగాణ వారి కోసం హెల్ప్‌లైన్‌ నెంబర్లు

హైదరాబాద్: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్, హైదరాబాద్‌లోని సచివాలయంలో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఈ సందర్భంగా రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలంగాణ వారి కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ నుంచి 75 కాల్స్ వచ్చాయని, వారందరిని రప్పించడానికి భారత విదేశీ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సీఎస్ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. సహాయం కోసం ఈ కింది నెంబర్లను సంప్రదించాలని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.

ఢిల్లీ తెలంగాణ భవన్​లో సంప్రదించాల్సిన నెంబర్లు

విక్రమ్​సింగ్​మాన్ : +91 7042566955

చక్రవర్తి పీఆర్​ఓ  : +91 9949351270

నితిన్ ఓఎస్డీ         : +91 9654663661

ఈమెయిల్ ఐడీ   : rctelangana@gmail.com

తెలంగాణ సచివాలయంలో సంప్రదించాల్సి నెంబర్లు..

ఈ.చిట్టిబాబు ఏఎస్​ఓ : 040-23220603

ఫోన్ నంబర్                 : +91 9440854433

ఈ-మెయిల్ ఐడీ          : so_nri@telanagan.gov.in