గొర్ల మంద మీద తోడేళ్ళు దాడి చేసినట్లు చేస్తున్నరు

గొర్ల మంద మీద తోడేళ్ళు దాడి చేసినట్లు చేస్తున్నరు

గొర్రెల మంద మీద తోడేళ్ళు దాడి చేసినట్లు దాడి చేస్తున్నారు
తెలంగాణ కు చైతన్యాన్ని నింపిన గడ్డ మీద కుట్ర చేస్తున్నారు
తెలంగాణ ఉద్యమంకు సంబంధం లేని వ్యక్తి ఇప్పుడు మంత్రిగా బెదిరింపులకు దిగుతున్నారు
ప్రజలు గమనిస్తున్నారు మీకు గుణపాఠం తప్పదు
కరోనా పేషెంట్లకు మెరుగైన వైద్యం అందిచాల్సిన సమయం ఇది,  ఇప్పుడు కాదు రాజకీయాలు, వెకిలిచేష్టలు
ఇక నైనా ఆపండి లేదంటే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నా

 

క‌రీంన‌గ‌ర్ జిల్లా: గ్రామీణ ప్రాంతాల్లో కూడా క‌రోనా సోకి అనేక మంది చనిపోతున్నారని తెలిపారు ఈట‌ల రాజేంద‌ర్. స్వయంగా సీఎం కేసీఆర్ రివ్యూ పెట్టీ మరీ ..ఏ జిల్లాలో మంత్రులు ఆ జిల్లాలో కొవిడ్ సేవలు పర్యవేక్షించాలని చెప్పి, అనివార్యమైన పరిస్థితుల్లో లాక్ డౌన్ పెట్టారన్నారు. కానీ కరీంనగర్ జిల్లాలో అందుకు బిన్నంగా జిల్లా ప్రజల ప్రాణాలు గాలికి వదిలేసి, హుజురాబాద్ ప్రజా ప్రతినిధుల మీద గొర్ల మంద మీద తోడేళ్ళు దాడి చేసినట్లు చేస్తున్నారన్నారు. అక్కడ ఉన్నవారంతా 20 ఏళ్లుగా తెలంగాణా ఉద్యమాన్ని కాపాడి, ఆత్మగౌరవ బావుటా ఎగురవేసిన వారిపై.. ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేని మంత్రి, ముఖ్యమంత్రి నియమించిన కొంతమంది ఇంఛార్జిలు అదే పనిగా సర్పంచ్ లు ఎంపీటీసీ లకి ఫోన్ చేసి డబ్బులు ఆశ చూపుతున్నార‌న్నారు. ప్రలోభాలకు గురి చేయడం బిల్లులు రావని బెదిరిస్తున్నారు. వారికి ఇష్టం లేకపోయినా కూడా..  వారితో నాకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇప్పిస్తున్నార‌ని తెలిపారు. పిడికెడు మంది స్టేట్ మెంట్  ఇచ్చినంత మాత్రానా.. ప్రజాభిప్రాయాన్ని మారుస్త అనుకోవడం వెర్రి బాగులతనం మాత్రమే అన్నారు. హుజురాబాద్ ప్రజలు చాలా చైతన్యవంతం ఉన్నవారని, ఆత్మగౌరవం ఉన్నవారన్నారు. ఇలాంటి చిల్లర మల్లర చర్యలను ప్ర‌జ‌లు తిప్పికొడతారని.. ఎప్పుడన్నా నియోజకవర్గానికి వచ్చారా అని ప్ర‌శ్నించారు. 


20 ఏళ్ల నుండి కష్టపడుతున్న వారిని మనోవేదనకు గురిచేస్తే సహించనన్నారు. కరోనా పేషెంట్లును కాపాడడం చేయండి తప్ప.. ఇలాంటి చిల్లర పనులు చేయకండన్నారు. వీటిని హుజురాబాద్ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా తిప్పికొడతరని తెలిపారు. సమైఖ్య రాష్ట్రంలో కూడా ఇలాంటి ప్రయత్నం చేసి భంగ పడ్డారు. ఇప్పుడు కూడా మీకు అది తప్పదు, సరిఅయిన సమయంలో ఘోరీ కడతారన్నారు. ఇరవై ఏళ్లుగా ఉద్యమంలో పాల్గొన్న వారిని కోడి తన్ పిల్లలను రెక్కల కింద కాపాడుకున్నట్లు కాపాడుకుంటున్నా.. ఇప్పుడు ఇలాంటి వారు వచ్చి తల్లిని పిల్లని వేరు చేసినట్లు చేస్తున్నారన్నారు. ప్రలోభ పెడితే ఇబ్బంది పెడితే కొంత మంది మాట్లాడుతుండవచ్చు కానీ.. వారి అంతరాత్మ మాత్రం నా తోనే ఉంటుందన్నారు. ఇరవై ఏళ్లుగా వారి జీవితాలతో పెన వేసుకొని ఉన్న వారందరినీ కాపాడుకుంటా అన్నారు. అంతిమ విజయం న్యాయానిది, ధర్మానిది తప్ప కుట్రలు ఎప్పుడు విజయం సాధించవన్నారు ఈట‌ల రాజేంద‌ర్.