
హుజురాబాద్ బైపోల్ లో అధికార యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరించిందని ఆరోపించారు మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్. బస్సుల్లో EVM లను మార్చినట్లు అనుమానాలు వస్తున్నాయన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికల్లో అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు ఈటల రాజేందర్.